రవిశాస్త్రితో ప్రేమాయణమా..? ఐ లవ్ ఐస్ క్రీమ్.. నిమ్రత్ కౌర్ ట్వీట్స్

మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (10:43 IST)
లవర్‌బాయ్‌గా గుర్తింపు పొందిన భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. 56 ఏళ్ల వయసులో ఓ కొత్త తోడు దొరికిందని, ఆమె బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. రవిశాస్త్రి కంటే వయసులో 20 ఏళ్లు చిన్నదైనా.. ఆమెతో రవి డేటింగ్ చేస్తున్నాడని టాక్ వచ్చింది.
 
ఈ మేరకు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ నటించిన 'ఎయిర్‌లిఫ్ట్' మూవీతో నిమ్రత్ ఫేమసైంది. ఈ ఇద్దరూ రెండేళ్ల నుంచి సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నట్లు ముంబై మిర్రర్ పత్రిక వెల్లడించింది. నిజానికి 2015 నుంచి ఈ ఇద్దరిని లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తమ కొత్త కార్ల లాంచింగ్‌కు పిలుస్తోంది. గత మూడేళ్లుగా ఎన్నో మోడల్స్‌ను రవి, నిమ్రత్ కలిసి లాంచ్ చేశారు. అయితే ఆ కొత్త కార్లు వీళ్ల మనసుల్ని కూడా కలిపాయన్న సంగతి ఇప్పుడే బయటపడింది. 
 
కానీ తాను టీమిండియా కోచ్ రవిశాస్త్రితో సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ కొట్టిపారేసింది. ఈ వార్తలన్నీ అవాస్తవమని చెప్పింది. ఆడి కార్ల సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో తాము పాల్గొన్నామని, అంతకుమించి ఇద్దరి మధ్య ఏమీ లేదని ట్విట్టర్లో తేల్చి చెప్పేసింది. మీడియాలో వస్తున్న వార్తలు తనను ఎంతో బాధపెట్టాయని నిమ్రత్ కౌర్ స్పష్టం చేసింది. ముందుముందు నిజం అందరికీ తెలుస్తుందని, తనకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నానని తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు