స్ట్రెచెర్ లేదనీ... దుప్పట్లో పేషెంట్‌ను పడుకోబెట్టి ఈడ్చుకెళ్లారు... (Video)

శనివారం, 30 జూన్ 2018 (16:12 IST)
దేశంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితికి ఇది మరో మచ్చుతునక. మహారాష్ట్రలోని నాంధేడ్ ప్రభుత్వ పెద్దాసుపత్రిలో నడవలేని రోగిని తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ లేదా వీల్‌చైర్ లేకపోవడంతో దుప్పట్లో పడుకోబెట్టి లాక్కెళ్లారు. ఇది ఆ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
శనివారం ఉదయం నాంధేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను వాహనంలో ఆమె కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఆ మహిళ నడవలేని స్థితిలో ఉండటంతో స్ట్రక్చర్ లేదా వీల్‌చైర్ కోసం ఆమె వెంట వచ్చినవారు ఆస్పత్రి ప్రాంగణంలో వెతికారు. 
 
వైద్యులను, సిబ్బందిని అడిగారు. వారి నుంచి స్పందన లేదు. పైగా, ఆ మహిళను మోసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక చేసేదేం లేక ఆ మహిళను దుప్పటిలో పడుకోబెట్టి ఈడ్చుకెళ్లారు. ఇది కెమెరా కంట్లో పడింది. 
 
రూ.లక్షల కోట్లు నిధులు ఆస్పత్రులకు ఇస్తున్నా.. ఇప్పటికీ ఇలాంటి దయనీయమైన పరిస్థితులు ఉండటంపై ప్రజలు మండిపడుతున్నారు. వీల్‌చైర్ కూడా లేకపోవటం ఏంటీ.. ఆస్పత్రిలోనే ఈ ఈడ్చుకెళుతున్నారు అంటే.. సౌకర్యాలు ఎక్కడ ఉన్నాయని నిలదీస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

 

#WATCH Relatives of a patient drag her with the help of a bedsheet, allegedly due to unavailability of a stretcher at a Government hospital in Maharashtra's Nanded. (28.6.18) pic.twitter.com/HM1tXtrlO1

— ANI (@ANI) June 30, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు