ఈ నేపథ్యంలో కాశ్మీర్ లోయలో అడుగడుగునా భద్రతా బలాలను మోహరించారు. కాశ్మీర్ మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను ఆదివారం రాత్రి నుంచి గృహ నిర్బంధం చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. బహిరంగ సమావేశాలు, గుంపులుగా తిరగడాలను నిషేధించారు. శ్రీనగర్ జిల్లాలో సెక్షన్ 144 అమలుచేశారు.
కాగా, కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు తమ దేశ పర్యాటకులను కాశ్మీర్ నుంచి వెనక్కి రావాల్సిందిగా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇక కాశ్మీర్‌లోని ఎన్ఐటికి సెలవులు ప్రకటించి.. విద్యార్థులను కూడా ఖాళీ చేయించింది కేంద్ర ప్రభుత్వం. అమర్‌నాథ్ యాత్ర ప్రయాణికులను కూడా వెనక్కి పంపించేసింది.