మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజ ముండేకు కోవిడ్ పాజిటివ్

గురువారం, 29 ఏప్రియల్ 2021 (18:26 IST)
రోజూ కరోనా కేసులు దేశంలో పెరిగిపోతున్న వేళ.. సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బీజేపీ నాయకురాలు, మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజ ముండే కరోనా బారిన పడ్డారు. తనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ అని తేలిందనీ తెలిపారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని ఆమె ఇవాళ ట్విటర్లో వెల్లడించారు.
 
''నాకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే నేను స్వీయ నిర్బంధంలో ఉన్నాను. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాను. నేను ఇటీవల చాలామంది కరోనా బాధితులను కలుసుకున్నాను. అక్కడే నాకు ఇన్ఫెక్షన్ సోకి ఉండాలి..'' అని ఆమె పంకజ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఇటీవల తనకు సమీపంగా మెలిగిన వారంతా స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు