ఎవరు.. ఎవరితో పడుకున్నా పవనే ఆన్సర్ చెప్పాలా.. నా బతుకిలా అయిపోయింది...

గురువారం, 27 సెప్టెంబరు 2018 (08:57 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పేరును ప్రస్తావించకుండానే పరోక్షంగా ఆయన్ను టార్గెట్ చేశారు. ఈ మీడియా ఇలాంటి రౌడీ వెధవలపై స్టింగ్ ఆపరేషన్ చేయొచ్చు కదా అని వ్యాఖ్యానించారు. అలా చేయడం వదిలివేసి... పవన్ కళ్యాణ్‌పైనే ఫోకస్ పెడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.
 
వెస్ట్ గోదావరి జిల్లా దెందులూరులో పవన్ కళ్యాణ్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టార్గెట్‌గా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియాపై కూడా పవన్ సెటైర్లు సంధించారు. 
 
ఈ మీడియా కేవలం పవన్ అనే వ్యక్తిపైనే ఎందుకు ఫోకస్ పెడుతుందో అర్థం కావడం లేదన్నారు. 'ఎవరు ఎవరితో పడుకున్నా పవనే సమాధానం చెప్పాలి.. నా బతుకిలా అయిపోయింది' అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
'మీరూ.. మీరూ పడుకుంటే నేనేం చేయాలని' పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దానిపైన ప్రోగ్రాంలు, ఆరు నెలలు.. సంవత్సరం నడుపుతూ టీఆర్‌పీలు పెంచుకుంటున్నారని మీడియాపై పవన్ విమర్శలు చేశారు. మరి ఇలాంటి రౌడీల గురించి ప్రోగ్రాం ఎందుకు చేయరని ప్రశ్నించిన పవన్.. అలాంటి వాళ్లంటే మీడియాకు భయమని వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు