Monalisa Bhonsle కుంభమేళలో దండలమ్ముకునే యువతి మోనాలిసాకి బాలీవుడ్ బంపర్ ఆఫర్

ఐవీఆర్

మంగళవారం, 21 జనవరి 2025 (20:46 IST)
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా బాగా పాపులర్ అయిన మోనాలిసా భోంస్లె(Monalisa Bhonsle) అనే పేరు గల యువతికి బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె అందాన్ని చూసి డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఫిదా అయ్యారట. తను ఎన్నాళ్లుగానో తన చిత్రం డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రం కోసం అమాయకత్వంతో కూడిన అమ్మాయి కోసం వెతుకుతున్నాననీ, ఇప్పుడు తన చిత్రంలో ఈమె కరెక్టుగా సరిపోతుందని అభిప్రాయపడుతున్నారట. తన చిత్రంలో రైతు కూతురి పాత్రలో నటించేందుకు మోనాలిసా సెలెక్ట్ చేస్తాననీ, ఆమెకి నటన నేర్పించి నటింపజేస్తానంటున్నాడు.
 
కాగా ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు చేసేందుకు జనం ఎగబడుతుండటంతో ఆమె తండ్రి ఆమెను ఇండోర్‌లోని తన ఇంటికి తిరిగి పంపించాలనుకున్నారు. కానీ ఆమె అక్కడే వున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్‌లో వేలాది మందిని ఆకర్షించిన అమాయక చిరునవ్వు, అద్భుతమైన తేనె కళ్ళు గల అమ్మాయి పేరు మోనాలిసా భోంస్లే. ఈ మోనాలిసాకు చెందిన వైరల్ అయిన వీడియో 15 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించి రాత్రికి రాత్రే సంచలనంగా మారింది.
 

Time changes, Power of Social Media. pic.twitter.com/jab6KE75oV

— Monalisa Bhosle (@MonalisaIndb) January 21, 2025
ఆమె రుద్రాక్షతో పాటు పలు దండలు అమ్మే వ్యాపారం చేస్తోంది. ఆమె గురించి సోషల్ మీడియా యూజర్ సచిన్ గుప్తా వెల్లడించిన వివరాల ప్రకారం, సందర్శకులు దండలు కొనడానికి కాకుండా ఆమెతో సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడానికి ఎగబడుతున్నారు. కొంతమంది కస్టమర్లు మాత్రమే తన దండలు కొనుగోలు చేస్తున్నారని, ఎక్కువ మంది ఆమెతో ఫోటోలు, వీడియోలు తీయడానికి ప్రాధాన్యత ఇచ్చారు.
 

A girl in Mahakumbh Mela is stealing the heart of the people

The girl whose name is Monalisa Bhonsle, came to Mahakumbh Mela in Prayagraj (UP) from Indore (MP) to sell her handmade garlands (Mala), has become an internet sensation because of her natural beauty. People are… pic.twitter.com/wj5sNaW1da

— Alok Ranjan Singh (@withLoveBharat) January 17, 2025
నెటిజన్లు 'బ్రౌన్ బ్యూటీ' అని ఆప్యాయంగా ప్రస్తావించిన మోనాలిసా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం మోనాలిసా ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవడంతో ఆమెకి బాలీవుడ్ ఇండస్ట్రీలో బంపర్ ఆఫర్ తగిలింది. మరోవైపు ఆమె పేరుతో ట్విట్టర్లో ఓ పేజీ కూడా క్రియేట్ అయిపోయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు