రాజీవ్ ఆ ప్లాట్‌ను నిర్మాత విజయ్ చౌదరికి విక్రయించాడు. విజయ్ చౌదరి ఆ ప్లాట్‌ను రూ.70 లక్షలకు మరొక వ్యక్తికి విక్రయించాడు. ఇప్పుడు, లేని ప్లాట్‌ను తనకు అమ్మేశారని ఫిర్యాదుదారుడు ఆరోపించడంతో విషయం అస్పష్టంగా మారింది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో విజయ చౌదరిపై కేసు నమోదైంది. ఆ తర్వాత, పోలీసులు రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ చేశారు.
అయితే, రాజీవ్ తన ఆరోగ్యం బాగోలేదని, తర్వాత హాజరు అవుతానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో రాజీవ్ A2. ఈ కేసులో ఆయనను సాక్షిగా పిలిచారు. ఈ ఘటనపై పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.