మద్యం దుకాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్, అక్కడేం పని?

సోమవారం, 18 జనవరి 2021 (13:05 IST)
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
రజినీకాంత్... దక్షిణది సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనం. రాజకీయ రంగంలోకి అడుగుపెడతానని ప్రకటించిన ఆయన ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇదిలావుంటే ఇపుడు ఆయనకు సంబంధించిన ఓ ఫోటో విపరీతంగా షేర్ అవుతోంది.
 
ఆయన ఓ బార్‌లో నిలబడి ఉన్నప్పుడు తీసిన ఫోటో సోషల్ మీడియాలో కనిపించడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. రజనీకాంత్ ఒక మద్యం దుకాణం లోపల నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఆ దుకాణం ఆయన అభిమానుల మద్యం దుకాణం అని చెపుతున్నారు.
 
అభిమానులను రజినీకాంత్ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఆ క్రమంలో రజినీ అక్కడికి వెళ్లి వుండొచ్చని తెలుస్తోంది. ఇకపోతే రజనీకాంత్ ప్రస్తుతం సిరుతై శివ దర్శకత్వం వహించిన చిత్రంలో నయనతార, ఖుష్బు, మీనా తదితర తారలతో నటిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు