#HBDPriyankaGandhi : అరుదైన ఫోటోను షేర్ చేసిన ప్రియాంకా

మంగళవారం, 12 జనవరి 2021 (09:32 IST)
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తన 49వ పుట్టినరోజు వేడుకను జనవరి 12వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె తన నాన్నమ్మ ఇందిరా గాంధీతో పాటు.. తండ్రి రాజీవ్ గాంధీలతో ఉన్న అరుదైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా 1972 జనవరి 12వ తేదీన జన్మించిన ప్రియాంకా గాంధీ.. రాబర్ట్ వాద్రాను పెళ్లి చేసుకున్నారు. ఈమెకు ఇద్దరు పిల్లలు.
 
కొంత రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రియాంకా గాంధీ.. ఆ తర్వాత పార్టీ శ్రేణులు, పార్టీ నేతలు ఒత్తిడి మేరుకు రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆమె పార్టీకి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అలాగే, దేశంలో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు