హెల్మెట్-శిరస్త్రాణము. ద్విచక్రవాహనం నడిపేటపుడు తప్పనిసరిగా ధరించాల్సిన రక్షణ కవచం ఇది. ఐతే చాలామంది దాన్ని పట్టించుకోరు. కొంతమంది హెల్మెట్ వున్నా... దాన్ని తన వాహనం ఆయిల్ ట్యాంకు పైనో... లేదంటే వెనక సీటుకు బిగించి వెళుతుంటారు. కానీ హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను ఎలా రక్షిస్తుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పట్టింపులేని ధోరణి మరీ ఎక్కువగా కనబడుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత చింతించి ప్రయోజనం లేదు, అది జరగక మునుపే జాగ్రత్తలు తీసుకోవాలి. ద్విచక్ర వాహనాన్ని నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.