బుజ్జి కుక్కను కాపాడేందుకు చిన్నారు సాహసం.. కొండచిలువతో పోరాటం (Video)

శనివారం, 28 సెప్టెంబరు 2019 (14:36 IST)
సాధారణంగా కొండ చిలువ పేరు చెబితేనే ప్రతి ఒక్కరూ భయంతో వణికిపోతారు. అలాంటిది ఓ బుజ్జి కుక్కను కాపాడేందుకు చిన్నారులు పెద్ద సాహసమే చేశారు. ఏకంగా కొండ చిలువతో పోరాడి.. ఆ కుక్కపిల్లను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ముగ్గురు చిన్నారు చూపిన సాహసం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కుక్కను కొండచిలువ చెరనుంచి బయటపడేసేందుకు నానా రకాలుగా ప్రయత్నించారు. తమకు దొరికిన ఆకులు, అలుమలను వాటిపై విసురుతూ.. రాళ్లతో కొడుతూ.. అసమాన ధైర్యసాహసాలను కనబర్చారు. 
 
చివరకు ఒకరు కొండచిలువ తలను ఒడుపుగా పట్టుకుంటే.. మరొకరు తోకను పట్టాడు. ఇంకొకరు కుక్కను చాలా జాగ్రత్తగా దాన్నుంచి విడదీశారు. దాని పట్టు నుంచి తప్పుకున్న కుక్క ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కొండచిలువ నుంచి కుక్కను కాపాడిన చిన్నారులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
ఈ వీడియోకి సంబంధించి స్పష్టమైన వివరాలు లేవు. అయితే, ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ వాస్తవానికి ఇది రెండు మూడేళ్ళ క్రితం జరిగినట్టుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని లింకులు కూడా ఇంటర్నెట్‌లో ఉన్నాయి. 

 

These kids are way tougher than I am. Not all heroes wear capes.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు