NH931లో డిస్‌ప్లేయింగ్ బోర్డుకు వేలాడుతూ స్టంట్స్.. అంతా రీల్స్ పిచ్చి (వీడియో)

సెల్వి

సోమవారం, 30 సెప్టెంబరు 2024 (12:24 IST)
Pull-Ups
సోషల్ మీడియాలో రీల్స్ వీడియోల కోసం జనం పిచ్చి పిచ్చి పనులతో పాటు సాహసాలు చేస్తున్న ఘటనలు ఎన్నో వున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చిలో ప్రాణంతో చెలగాటం ఆడాడు ఓ వ్యక్తి. అమేథీలోని ఎన్ హెచ్931లో డిస్‌ ప్లేయింగ్ బోర్డు ఎక్కి ఘోరమైన స్టంట్ చేశాడు ఓ యువకుడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. 
 
యూపీలోని అమేథీలో తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నగర శివారుల్లోని ఎన్ హెచ్931లో డిస్‌ ప్లేయింగ్ బోర్డుపై  ఎక్కిన ఓ యువకుడు బోర్డుకు వేలాడుతూ ఘోరమైన స్టంట్ చేశాడు. 
 
ఈ వీడియో వైరల్ కావడంతో యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలా కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి పిచ్చి పనులు మరొకరు చేయరని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సోషల్ మీడియా పిచ్చిలో ప్రాణంతో చెలగాటం..

అమేథీలోని NH931లో డిస్‌ప్లేయింగ్ బోర్డు ఎక్కి ఘోరమైన స్టంట్ చేసిన యువకుడు

కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన నెటిజన్స్#Amethi #Stunts #BigTV pic.twitter.com/ztr5JVMv1J

— BIG TV Breaking News (@bigtvtelugu) September 30, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు