ఐఎన్ ఎక్స్ మీడియా స్కాంలో ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ సహ నిందితులు. ఐఎన్ ఎక్స్ మీడియాను 2007లో స్థాపించారు ఈ దంపతులు. ఆ సమయంలో చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రి. విదేశీ పెట్టుబడులు చిదంబరం పర్యవేక్షణలోనే ఉండేది. దీంతో చిదంబరం కుమారుడు కార్తీక్ సహకారంతో 305 కోట్ల రూపాయలను సమకూర్చుకున్నారన్నది ఆరోపణ.
ఈ పెట్టుబడుల వ్యవహారంలో చిదంబరం ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారన్నది అభియోగం. ఇంద్రాణి ముఖర్జీ దంపతులతో ఆయన పలుమార్లు భేటీ అయ్యారనీ, ఈ విషయాన్ని ఇంద్రాణి స్వయంగా వివరించినట్లు సీబీఐ నివేదికలో వెల్లడించింది. ఐఎన్ఎక్స్‌లో ఎంత పెట్టుబడులు పెట్టారోనన్న విషయాన్ని సిబిఐకి ఆమె తెలియజేసింది. ఈ స్టేట్మెంట్ ఆధారంగా సిబిఐ చిదంబరాన్ని అరెస్టు చేసింది.