నారా లోకేష్ ఈ తప్పు ఎందుకు చేస్తున్నారు...?

బుధవారం, 5 మే 2021 (17:32 IST)
తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొన్ని కొన్ని అంశాలు కాస్త కీలకంగా మారుతున్నాయి. ప్రధానంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ మధ్య కాలంలో యువత లోకి బలంగా వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని కొన్ని అంశాల్లో లోకేష్ గతంలో తప్పులు ఎక్కువగా చేసినా సరే ఇప్పుడు మాత్రం ఆయన కొన్ని తప్పులను పరిష్కరించుకుని వాటిని మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. పునరావృతం కాకుండా టిడిపి సీనియర్ నాయకులు నుంచి సహకారం కూడా తీసుకుని ముందుకు వెళ్తున్నారు.
 
అయితే ఇప్పుడు లోకేష్ విషయంలో టిడిపి నాయకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పదో తరగతి ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఆయన కొంతమందిని కలుపుకొని ముందుకు వెళ్లలేదు అనే అభిప్రాయం చాలా వరకు కూడా వ్యక్తమయింది.

కొంతమంది నాయకులు జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించినా సరే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వాళ్లతో కలిసి పనిచేయడానికి ముందుకు రాలేదు. దానికితోడు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్న బలమైన కుటుంబాలకు చెందిన నాయకులను నారా లోకేష్ పట్టించుకోలేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
 
భవిష్యత్తులో లోకేష్ ఇదేవిధంగా ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉండటానికి చాలామంది నాయకులు ఆసక్తి చూపించే అవకాశాలు ఉండకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో కూడా ఇదేవిధంగా వ్యవహరించారు అని ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపించాయి.

తిరుపతి ఉప ఎన్నికల్లో చాలామంది నాయకులు టిడిపి కోసం పనిచేయడానికి ఆసక్తి చూపించలేదు. లోకేష్ వాళ్ల విషయంలో సమర్థవంతంగా వ్యవహరించలేదు అనే భావన చాలా వరకు వ్యక్తమైంది. నాయకుడిగా ఎదిగే క్రమంలో అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉన్నాసరే లోకేష్ మాత్రం అలా ముందుకు వెళ్లడం లేదని టిడిపి నాయకులు స్వయంగా అంటున్నారు. మరి భవిష్యత్తులో ఎలా ఉంటారో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు