'గోల్ ఇన్ సారీ'.. చీరకట్టులో ఫుట్ బాల్ ఆడిన మహిళలు.. వీడియో వైరల్

మంగళవారం, 28 మార్చి 2023 (09:01 IST)
గ్వాలియర్‌లో శనివారం 'గోల్ ఇన్ సారీ' పేరుతో అసాధారణ మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు వైబ్రెంట్ చీరలు ధరించి ఫుట్‌బాల్ ఆడుతున్నారు. గ్వాలియర్ MLB గ్రౌండ్‌లో ఆదివారం వరకు కొనసాగింది. ఇప్పుడీ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. 
 
పోటీ సమయంలో, పింక్ బ్లూ జట్టు మైదానంలో తమ అత్యుత్తమ సామర్థ్యాలను ప్రదర్శించి ఆరెంజ్ మేళా జట్టుపై విజయం సాధించింది. ఈ టోర్నీలో నగరానికి చెందిన ఎనిమిదికి పైగా మహిళా జట్లు పాల్గొన్నాయి. 
 
ఇందులో 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళా క్రీడాకారులు ఉన్నారు. క్రీడలలో మహిళల సామర్థ్యాన్ని ఎత్తిచూపడం ద్వారా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం, మూస పద్ధతులను బద్దలు కొట్టడం కోసం ఈవెంట్ ప్రశంసించబడింది. క్రీడలు ఆడుతున్నప్పుడు మహిళలు చీరలతో పాల్గొన్నారు. చీరలతో ఫుట్ బాల్ ఆడుతూ అందరి ప్రశంసలను పొందారు. 
Saree
 
గెలుపొందిన జట్టు, పింక్ పాంథర్, తమ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బ్లూ క్లీన్ జట్టు మైదానంలో తమ అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించి, రెండవ మ్యాచ్‌లో విజేతగా నిలిచింది.

Watch | #Gwalior women ditch shorts and pants, play football in #sarees.#women #football #sports #india pic.twitter.com/7bhZsdR9uA

— Free Press Madhya Pradesh (@FreePressMP) March 26, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు