"ఇండియన్ గోల్డెన్ గర్ల్"కు థార్.. అందించిన మహీంద్రా ఆటోమోటివ్

మంగళవారం, 28 మార్చి 2023 (08:13 IST)
ఢిల్లీలో జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌పై దేశం నలుమూలల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. 50 కేజీల కేటగిరీలో వియత్నాం బాక్సర్ ఎన్‌‍గెయెన్ థి టామ్‌పై జరీన్ పూర్తి ఆధిపత్యం కొనసాగించి 5-0తో విజయం సాధించారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో నిఖత్ జరీన్‌కు ఇది రెండో స్వర్ణం పతకం. 2022లో 52 కేజీలో విభాగంలో నిఖత్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. 
 
స్వర్ణ పతకం సాధించిన నిఖత్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. నిఖత్ తెలంగాణకు గర్వకారణమంటూ ఆమె తన విజయాలతో దేశ ఖ్యానికి ఇనుమడింపజేశారని కొనియాడారు. కాగా, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకున్న నిఖత్.. మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్ అవార్డును కూడా గెలుచుకున్నారు. 
 
ఈ పోటీల్లో ఆమె తనకు ఎదురనేదే లేదని నిరూపించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఆమెకు ప్రముఖ ఆటో మొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా ఆటోమోటివ్ కంపెనీ 'మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్ అవార్డు'ను గెలుచుకున్నారు. నిఖత్ భారత క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందంటూ మహీంద్రా ట్వీట్ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు