ఐదు పైసల నాణేన్ని తెచ్చిన తొలి వంద మందికి ఒకటిన్నరి ప్లేటు చికెన్ బిర్యానీ ఇస్తామని సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇలా ఐదు పైసలు నాణేలను తెచ్చిన వారి పేర్లు, సెల్ ఫోన్ నెంబర్లు తీసుకొచ్చిన వారికి బిర్యానీ అందజేశారు. మనం ఉపయోగించిన వస్తువులు, నాణేలపై రానున్న తరానికి అవగాహన కల్పించేందుకే తాము ఇలా చేసినట్లు దుకాణం యజమాని ముజిఫర్ రహ్మాన్ తెలిపారు.
ఐదు పైసల నాణాలు దొరకని వారు మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. అయితే ఇలా చేయడానికి ఓ విశేషం ఉందంటున్నారు ముజీబ్ బిర్యానీ యజమానులు. అక్టోబర్ 16 వరల్డ్ ఫుడ్ డే కావడం ఒక కారణం అయితే దాదాపుగా కనుమరుగవుతున్న వస్తువులు, నాణాలపై రానున్న తరాలవారికి అవగాహన కల్పించడానికే ఈ విధంగా చేశామని తెలిపారు.