టీవీరంగంలోకి మోహన్‌బాబు!

FileFILE
సినీనటుడు మోహన్‌బాబు బుల్లితెర విఫణిలోకి అడుగిడనున్నట్లు టాలీవుడ్ సమాచారం. వార్తలు, ఎంటర్‌టైనర్, బిజినెస్ వంటి మూడు విభాగాల్లో మూడు ప్రత్యేక ఛానెళ్లను ప్రారంభించేందుకు మోహన్‌బాబు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిసింది. మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న నేతృత్వాన ఈ మూడు ఛానెల్స్ నిర్వహిచంబడనున్నట్లు సమాచారం.

ఇప్పటికే జీటీవీలో ఓ వైవిధ్య రియాల్టీ షోగా, ఇంటర్వ్యూ కార్యక్రమంగా ప్రసారమవుతున్న లక్ష్మీ టాక్ షోలో లక్ష్మీ అద్భుత యాంకరింగ్‌తో ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు ఛానెళ్ల ప్రారంభిస్తున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోహన్‌బాబు ఛానెల్ ప్రారంభిస్తే లక్ష్మీకి ఎంతో మంచిదని సన్నిహితులు చెబుతున్నారు.

కాగా, ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె సఫ్నాదత్ సారథ్యంలో కేబుల్ టీవీ తరహాలో ఓ లోకల్ ఛానెల్ ఇటీవలే ప్రారంభమైంది. ఇదే తరహాలో మోహన్‌బాబు కుమార్తె కూడా ముందుకు రావచ్చనే వార్తలు టాలీవుడ్ వస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి