పూజ గదిలో దేవుడి పటాలే వుండాలి.. పితృదేవతల ఫోటోలు అంటే తాత ముత్తాతల ఫోటోలు వుండకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. దేవుడి పటాల కిందనే తాతముత్తాల ఫోటోలు వుండాలి. దేవుడి ఫోటోలను, తాతముత్తాతల ఫోటోలను పక్కపక్కనే పెట్టకూడదు.
చాలామంది పెద్దలకు గౌరవం ఇచ్చే భావనతో పూజగదిలో మరణించినవారి ఫోటోలు పెడుతుంటారు. కానీ అవి మన దృష్టిని, ఆలోచనలను మరల్చడమే కాకుండా బాధాకరమైన జ్ఞాపకాలను మిగుల్చుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. అందుచేత తాతముత్తాల ఫోటోలను హాలులు కాస్త ఎత్తుగా లైట్ల డెకరేషన్‌తో అమర్చుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు.
అలాగే పూజ గదిలో గంటను ఏర్పాటు చేయడం సరికాదు. పూజ గది ఆలయం కాదు. అది మన వ్యక్తిగత ధ్యానానికి, పూజకు ఉద్దేశించింది కనుక పెద్ద శబ్దాలు లేకుండా ఉండటం మంచిది. పూజ గదిలో డబ్బు, ఇతర విలువైన వస్తువులను అక్కడ దాచడం సరికాదు.
ఇకపోతే.. పూజగదిని ఎప్పుడూ శుభ్రంగా వుంచుకోవాలి. పూజగదికి లేత రంగులను వేసుకోవచ్చు. తెలుపు, లేత పసుపు లేదా లేత నీలాన్ని ఎంచుకోవచ్చు. దీనివల్ల మనస్సు ప్రశాంతంగా ఉండి దేవుడిపై దృష్టి పెట్టడం సులభమవుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.