వాస్తు ప్రకారం వినాయకుడిని ఇంట్లో ఎలా ఉంచాలి? ఎందుకు?

మంగళవారం, 22 మే 2018 (12:36 IST)
గణేశుడి తొండం ఎప్పుడూ ఎడమ వైపు ఉండేటటువంటి ప్రతిమను లేదా ఫోటోను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి విగ్రహాన్నో, చిత్రపటాన్నో కొనడం చేయాలి. గణేశ వెనుకముఖం మీ ఇంట్లోని ఏ గదుల్లోకి ఎదుర్కొంటున్నట్లుగా ఉంచరాదు. గణేశుడు, సంపదలు, శ్రేయస్సులను అందించే దేవుడు, కాని ఆయన వెనుకముఖం పేదరికాన్ని సూచిస్తుంది. అందువలన, గణేశుడి వెనుకముఖం మీ ఇంటి బయటద్వారం ఎదుర్కొంటున్నట్లుగా ఉండాలి. 
 
మీ ఇంటి దక్షిణ దిశలో గణేశ విగ్రహం ఉంచకూడదు. తూర్పుదిశలో గానీ, పశ్చిమ దిశలోగాని గణేశుడి విగ్రహాన్ని ఉంచుకోవాలి. మీ పూజ గది కూడా దక్షిణదిశలో ఉండకూడదు. స్నానాలగదికి జోడించిన గోడకు ఎప్పుడూ గణేశ విగ్రహాన్ని ఉంచరాదు. మీరు ఉండే గదికి టాయిలె‌ట్‌కి ఉండే సాధారణ గోడ వద్ద కూడా గణేశుని విగ్రహం ఉంచకూడదు.
 
పలు కుటుంబాలు వారి ఇంట్లో స్పచ్ఛమైన వెండి వినాయక విగ్రహం ఉంచుతారు. మీ గణేశ విగ్రహం లోహంతో చేయబడి ఉంటే, అప్పుడు దానిని ఈశాన్నం లేదా నైరుతి దిశలో గాని ఉంచాలి. మెట్ల కింద గణేశవిగ్రహం ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే జనాలు మెట్ల మీద నడుస్తుంటారు అంటే వారు అక్షరాలా గణేశుని తలమీద నడిచినట్లుగా అర్థం. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దురదృష్టం తీసుకొస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు