గృహంలో నీటి వసతి ఎలా ఏర్పాటు చేసుకోవాలి..?

శుక్రవారం, 30 నవంబరు 2018 (13:06 IST)
గృహానికి తూర్పుదిక్కున బావి త్రవ్వించి నీటి వసతికి ఏర్పాటు చేసిన సంపద వృద్థి. ఈశాన్యంలో సౌఖ్యం, ఉత్తరాన అల్పసుఖం, గృహమధ్యంలో ధననష్టం, వాయవ్యంలో శత్రుబాధ, నైరుతిలో మృత్యుభయం, దక్షిణాన భార్యావియోగం, ఆగ్నేయంలో పుత్రనాశనం సంభవిస్తుంది. కనుక యుక్తమైన దిశ చూసుకుని నీటివనరు ఏర్పాటు చేసుకోవాలి.
 
1. అష్టమశుద్ధి చూసుకుని - గురు, శుక్ర, చంద్ర గ్రహములతో కూడియున్న లగ్నములు, జలతత్త్వ రాశులైన కర్కాటక, మకర, కుంభ, మీన లగ్నములు.. సోమ, బుధ, గురు, శుక్రవారాలు శ్రేష్టం.
 
2. నక్షత్రాల విషయానికి వస్తే - రోహిణి, మఖ, హస్త, ఉత్తర, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, పుష్యమి, అనూరాధ, ధనిష్ట, శతబిషం, రేవతి నక్షత్రాలు శ్రేష్టం. 
 
3. తిథులలో - శుక్లపక్షం అయితే.. పాడ్యమి, చవితి, షష్ఠి, ద్వాదశి తిథులు మినహా మిగినవన్నీ మంచివి. బహుళపక్షం అయితే కేవలం పాడ్యమి మంచిదని గ్రహించాలి. 
 
4. ఇల్లు కట్టేముందే, ప్రహరీ గోడలు నిర్మించి ఈశాన్యంలో నీటివనరు ఏర్పాటు చేసుకుని, అనంతరం ఇల్లు కట్టడం శ్రేయస్కరం. 
 
5. ఇతరుల ఇళ్ళలోని వాడకం నీరు, మన ఇంటి ఆవరణలోనికి ప్రవేశించడం మంచిది కాదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు