కావాల్సిన పదార్థాలు: ఓట్స్ : రెండు కప్పులు తరిగిన ఉల్లిపాయలు : అరకప్పు టమోటా తరుగు : అరకప్పు బీన్స్ తరుగు : అరకప్పు పచ్చ బఠాణీలు : అరకప్పు అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి: 2 ఏలకులు, దాల్చిన చెక్క తాలింపుకు తగినంత నెయ్యి, నూనె : చెరో రెండు స్పూన్లు మిరప్పొడి, పసుపు పొడి, కొత్తిమీర తరుగు : కాసింత నిమ్మరసం: అర టీస్పూన్ జీడిపప్పు : ఆరు ఉప్పు : తగినంత.
ఓట్స్ బిర్యానీ ఎలా తయారు చేయాలి? ముందుగా ఓట్స్‌ను దోరగా నేతితో వేయించి మరిగే నీటిలో వేయాలి. వెంటనే ఓట్స్ నుంచి నీటిని వడిగట్టి పక్కన బెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక నెయ్యి, నూనె, దాల్చిన చెక్క, ఏలకులు వేయాలి. ఇవన్నీ వేగాక ఉల్లిపాయలు, టమోటాలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేర్చి దోరగా వేపాలి. తర్వాత బీన్స్, మిరప్పొడి, పసుపు పొడి, ఉప్పు చేర్చి వేపుకోవాలి. ఈ మిశ్రమానికి ఉడికించిన ఓట్స్‌ను చేర్చాలి. ఈ ఓట్స్ బిర్యానీనీ ప్లేట్‌లోకి తీసుకుని నిమ్మరసం చేర్చి కొత్తిమీర, జీడిపప్పులతో అలంకరించుకుని హాట్ హాట్‌గా టమోటా సాస్‌తో సర్వ్ చేయొచ్చు.