పనీర్‌తో పదార్థాలంటే పిజ్జా, బర్గర్, టిక్కా గుర్తొస్తాయి. కానీ క్యాల్షియం పోషకాన్ని సమృద్ధిగా అందించే పనీర్‌తో నోరూరించే షక్కర్ కండిని తయారు చేయండి. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు..
పనీర్ ముక్కలు - కప్పు ఉడికించి పొట్టుతీసిన చిలకడదుంప ముక్కలు - అరకప్పు ఉల్లిపాయ ముక్కలు - పావుకప్పు టొమాటో ముక్కలు - పావుకప్పు పచ్చిబఠాణీ - పావుకప్పు కూరకారం - టేబుల్ స్పూను కారం - చెంచా గరంమసాలా - అరచెంచా అల్లం వెల్లుల్లి పేస్టు - చెంచా నూనె - రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన కొత్తిమీర - కొంచెం ఉప్పు - తగినంత జీడిపప్పు - కొన్ని
తయారీ చేయు విధానం : చిలకడ దుంపలు, పనీర్‌ని ఒకే సైజులో ముక్కల్లా కోసుకోవాలి. పనీర్ ముక్కలని టేబుల్ స్పూను నూనెలో దోరగా వేయించుకుని తీసుకోవాలి. మిగిలిన నూనెను బాణలిలో వేడిచేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి. అవి దోరగా వేగాక అల్లంవెల్లుల్లిపేస్టు, టొమాటో ముక్కల్ని వేయాలి. అవి కూడా ఉడికాక పనీర్ ముక్కలు, తగినంత ఉప్పు వేయాలి. రెండుమూడు నిమిషాలయ్యాక కొత్తిమీర వేసి, జీడిపప్పుతో అలంకరించుకుంటే చపాతీలూ, పూరీలూ, ఇతర రోటీల్లోకి కూర సిద్ధం.