బటర్‌ విత్ పీస్ పులావ్ ఎలా చేయాలి?

FILE
వింటర్ సీజన్‌లో గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. వాటిలో పచ్చిబఠానీలు కూడా ఒకటి. పచ్చిబఠానీలను ఉపయోగించి వివిధ రకాల కర్రీస్, గ్రేవీస్ తయారుచేస్తుంటారు. అలాంటి పీస్‌, బటర్‌తో పులావ్ ఎలా తయారు చేయాలో తెలుసా?

బాస్మతి రైస్ - రెండు కప్పులు
పచ్చిబఠానీ - ఒక కప్పు
క్యారెట్ తరుగు- ఒక కప్పు
లవంగాలు - 2-3
ఎండుద్రాక్ష- 5-6
బిర్యానీ ఆకు - తగినంత
ఉప్పు- రుచికి సరిపడా
బటర్ - రెండు టీ స్పూన్లు

తయారీ విధానం :
ముందుగా బాస్మతి రైస్‌ను బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ప్రెజర్ కుక్కర్‌లో బటర్ వేసి, కరిగించాలి. వెన్న కరిగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు మరియు లవంగాలు వేసి వేగించుకోవాలి. శుభ్రం చేసుకున్న బాస్మతి రైస్‌లో క్యారెట్, పచ్చి బఠానీలు వేయాలి.

మీడియం మంట మీద మరో రెండు మూడు నిముషాలు బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. ఇప్పుడు అందులో ఉప్పు మరియు మిగిలిన పదార్థాలు కూడా వేసి వేగించాలి. ఇప్పుడు అందులో ఎండు ద్రాక్ష కూడా వేసి మిక్స్ చేయాలి. తర్వాత సరిపడా నీళ్ళు పోసి ఉడికించాలి.

తర్వాత మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, 5 నిముషాల తర్వాత మూత తీసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఈ పీస్ పులావ్‌ను బటర్ లేదా కర్రీ లేదా సలాడ్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది..!

వెబ్దునియా పై చదవండి