మునక్కాయ ఆవకాయ ఎలా చేయాలో తెలుసా!?

శుక్రవారం, 4 మే 2012 (14:56 IST)
FILE
కావలసిన పదార్థాలు:
మునక్కాయ ముక్కలు : ఆరు కప్పు
చింతపండు : అర కేజీ
ఉప్పు: తగినంత
కారం: రెండు కప్పులు
నూనె: తగినంత.

తయారీ విధానం:
ముందుగా చింతపండును నీళ్లలో కలిపి బాగా ఉడికించాలి. అందులో ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. చింతపండు మిశ్రమం బాగా ఆరిన తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బి పక్కనబెట్టుకోవాలి. తర్వాత బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత మునక్కాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి.

ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఒక పళ్ళెంలోకి తీసుకుని అందులో చింతపండు రసం, కారం వేసి కలియబెట్టాలి. స్టౌ మీద వేరో బాణలి పెట్టి నూనె పోసి ఆవాలు వేశాక చిటికెడు, మెంతి పొడి పోపు పెట్టి ఆ ముక్కలకు కలిపితే మునక్కాయ ఆవకాయ రెడీ...!

వెబ్దునియా పై చదవండి