సొరకాయతో రోటీని ఎలా తయారు చేస్తారు?

File
FILE
సాధారణంగా సొరకాయతో కేవలం కూరను మాత్రమే చేస్తారని చాలా మంది అనుకుంటుంటారు. వాస్తవంగా చెప్పాలంటే సొరకాయతో ఎన్నో రకాలైన కూరలు చేసుకోవచ్చు. ఇలాంటి వాటిలో ఒకటి సొరకాయ రోటీ. గోధుమ పిండితో ఎలా రోటీని తయారు చేస్తారో అదేవిధంగా దీన్ని కూడా తయారు చేయవచ్చు. ఈ సొరకాయ రోటీ తయారీని ఒకసారి పరిశీలిస్తే..

కావలసిన పదార్థాలు...
సొరకాయ తురుము : ఒక కాయ లేదా ఓ కప్పు
బియ్యపుపిండి : ఒక కప్పు
గోధుమ పిండి : ఒక కప్పు
పచ్చికొబ్బరి తురుము : సగం కప్పు
పచ్చి శెనగపప్పు : 50 గ్రాములు
అల్లం, పచ్చిమిర్చి మిశ్రమం : సరిపడ తీసుకోవాలి.
ఉల్లి తురుము : సగం కప్పు
జీలకర్ర : సగం టీస్పూన్‌
ఉప్పు : తగినంత
నూనె : రొట్టెలు కాల్చడానికి సరిపోయేంతగా.

ఎలా చేయారు చేస్తారు?
పైన పేర్కొన్న పదార్థాలన్నీ కలిపి చపాతీ పిండిలా చేసుకుని పది నిమిషాలు అలానే ఉంచాలి. ఆ తర్వాత మీకు కావలసిన సైజులో ఉండలుగా చేసుకోవాలి. వీటిని పాలిథిన్‌ కవరుపై మందంగా రొట్టెలుగా చేసుకోవాలి. ఆ వెంటనే వేడి పెనంపై కాల్చుకోవాలి. అంతే రుచికరమైన సొరకాయ రొట్టెలు రెడీ. వీటికి సాస్‌ లేదా మీకు ఇష్టమైన చట్నీని తయారు చేసుకుని ఆరగించవచ్చు.

వెబ్దునియా పై చదవండి