కిడ్నీలో రాళ్లను పోగొట్టే.. అరటిదూట రసం ఎలా చేయాలి?

శుక్రవారం, 12 అక్టోబరు 2018 (16:20 IST)
కిడ్నీలో రాళ్లున్నాయని వైద్యులు చెప్తే రోజూ అరటిదూట రసం తాగాల్సిందే అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. అలాగే కిడ్నీలో రాళ్లు చేరకుండా వుండాలంటే, వారానికి ఓసారి అరటిదూటను డైట్‌లో చేర్చుకోవాలి. అరటిదూట రసాన్ని ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు
అరటిదూట ముక్కలు- ఒక కప్పు
అల్లం పేస్ట్ - పావు స్పూన్
కొత్తిమీర తరుగు - ఒక స్పూన్
పెరుగు- పావుకప్పు
ఉప్పు- చిటికెడు 
 
తయారీ విధానం.. 
ముందుగా అరటిదూట ముక్కలు, పెరుగు, ఉప్పు, కొత్తిమీర తరుగు, అల్లం పేస్టు మిక్సీలా బాగా పట్టించి.. వడకట్టుకోవాలి. ఈ రసాన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని ఉదయం పరగడుపున తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య తొలగిపోతుంది. ఈ రసం తాగితే శరీరానికి కావలసిన పీచు పుష్కలంగా లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు