జలుబుకు చెక్ పెట్టే సూప్.. ఎలా చేయాలంటే...

గురువారం, 29 డిశెంబరు 2022 (13:39 IST)
కావలసిన పదార్థాలు:
కొండవుచింత, అలక్రపత్రము ఆకులు - 10.
వెల్లుల్లి రెబ్బలు - 1 కప్పు, 
కరివేపాకు - 1 కప్పు, 
జీలకర్ర పొడి - 1 టీ స్పూను,
పుదీనా ఆకులు - గుప్పెడు, 
మిరియాలు - తగినంత, 
తులసి ఆకులు - కొన్ని, 
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు, 
చిన్న ఉల్లిపాయలు - 10 (సన్నగా తరిగి పెట్టుకోవాలి).
 
తయారీ విధానం:
ఒక బాణలిలో వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఆకులు, ఉల్లిపాయ తరుగు, తులసి ఆకులు, కావలసినంత నీరు, ఉప్పు వేసి మీడియం మంట మీద బాగా మరిగించాలి. ఈ మిశ్రమానికి కాస్త కార్న్ పిండిని జారుగా కలిపి కాసేపు తెల్లనివ్వండి. సూప్ లా వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఫిల్టర్ చేసిన మిరియాలు, నిమ్మరసం కలిపి వేడి వేడిగా కార్న్ చిప్స్ తో తీసుకుంటే టేస్టు అదిరిపోతుంది. ఈ సూప్ తీసుకోవడం ద్వారా శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు దూరం అవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు