తయారీ విధానం:
ముందుగా మామిడి పిందెలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, కాసేపు నీడలో ఆరబెట్టాలి. ఇప్పుడు ఓ పాత్రలో ఆరిన మామిడి పిందెలు వేసి వాటి మీద నూనె వేసి బాగా కలుపుకోవాలి. తరువాత బాణలిలో నూనె వేసి కాగిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఆపై మరిగించి చల్లార్చిన పావుకప్పు నీళ్లు జతచేసి పొడిని మెత్తటి ముద్దలా అయ్యేలా చేయాలి. ఈ మిశ్రమాన్ని మామిడి పిందెల మీద పోసి కిందకి పైకి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూడు నాలుగు రోజుల పాటు అలానే ఉంచాలి. అంతే మామిడి పిందెలు మెత్తగా అయ్యి వడు మాంగా తినడానికి రెడీ.