కావలసిన పదార్థాలు : కంది, మినప, పెసర పప్పు.. తలా ఒక్కో గ్లాస్ బియ్యం : ఒక కేజీ నువ్వులు : 25 గ్రాములు ఉప్పు, కారం, నూనె : తగినంత
తయారీ విధానం : ముందుగా పప్పులను దోరగా వేయించి పక్కన బెట్టుకోవాలి. బియ్యాన్ని కూడా వేయించాలి. వీటన్నింటిని కలిపి మరలో పిండి పట్టించాలి. దానిలో నువ్వులు నాలుగు స్పూన్ల మరిగించిన నూనె.. తగినంత ఉప్పు, కారం, నీరు పోసి కలిపిన ముద్దను జంతికల గొట్టంలో పెట్టాలి. బాణలిపై నూనె వేడయ్యాక జంతికలు వేసి దోరగా వేయించుకోవాలి. ఆరాక వీటిని డబ్బాలో భద్రపరుచుకోవచ్చు.