పెసర పప్పు రొట్టెలు ఎలా తయారు చేస్తారు?

File
FILE
సాధారణంగా రొట్టెలను రాగి, సజ్జ, గోధుమలతో రొట్టెలు చేస్తుంటారు. అయితే, పెసరపప్పు రొట్టె తయారు చేయడం కొత్తగా ఉండొచ్చు. అలాంటి రొట్టెను ఎలా తయారు చేస్తారో ఒక్కసారి పరిశీలిద్ధాం.

పెసర పప్పు రొట్టె తయారీకి కావలసిన ముడి సరుకులు

బియ్యం పిండి : నాలుగు కప్పులు
పెసర పప్పు : ఒక కప్పు
ఉల్లిపాయ ముక్కలు : ఒక కప్పు
అల్లం వెల్లుల్లి : చెంచెడు
కరివేపాకు : రెండు రెమ్మలు
పచ్చిమిర్చి : సరిపడ
నూనె : సరిపడ
ఉప్పు : సరిపడ.

ఎలా తయారు చేస్తారంటే.. పెసర పప్పును శుభ్రంగా కడిగి నీళ్లు పోసి గంటపాటు నానబెట్టాలి. ఒక గిన్నెలో బియ్యం పిండి పోసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. నానబెట్టిన పప్పును కూడా వేసి కలిపి చివరగా రెండు కప్పులు మరిగించిన నీళ్లు పోసి రొట్టె తయారీకి అనువుంగా ఉండేలా పిండిని తయారు చేసుకోవాలి.

చల్లారాక నీళ్ల తడి అద్దుకుంటూ పిండిని ముద్దగా చేసి భక్ష్యాలు చేసే కవరుపై నూనె రాసి జామకాయ సైజులో పిండిని తీసుకొని చేతిలో భక్ష్యాల మాదిరిగా వెడల్పుగా చేసుకోవాలి. వీటిని పెనంపై వేసి చుట్టూ నూనె రాసి రెండు నిమిషాలయ్యాక తిప్పి వేసి కాలిన తర్వాత తీస్తే సరి. రుచికరమైన కారం రొట్టెలు రెడీ! వీటిని నేరుగానైనా లేదా పెరుగుతోనైనా తినవచ్చు.

వెబ్దునియా పై చదవండి