పేపర్ రోస్ట్ ఎలా చేయాలో తెలుసా?

గురువారం, 6 డిశెంబరు 2012 (17:58 IST)
FILE
కావలసిన పదార్థాలు:
‌‌మినపప్పు : ఒక కప్పు
బియ్యం : ఐదు కప్పులు
జీలకర్ర : రెండు టీ స్పూన్లు
నూనె : ఒక కప్పు
ఉప్పు : ‌తగినంత.


తయారీ విధానం:
ముందు మినప్పప్పు, బియ్యాన్ని విడివిడిగా ఐదైదు గంటలపాటు నానబెట్టాలి. తరువాత విడిగానే మెత్తగా రుబ్బుకుని.. రెండు మిశ్రమాలను బాగా కలిపి తగినంత ఉప్పు వేసి రాత్రంతా ఉంచాలి. తెల్లవారున టిఫిన్ తీసుకునేందుకు ఒక గంట ముందు జీలకర్రను ముద్దగా చేసి రాత్రంతా నానిన మిశ్రమాన్ని కలిపి, పెనం వేడయ్యాక పేపర్‌లా పలుచగా దోసెలు పోసుకోవాలి. సన్నని సెగపై దోరగా వచ్చేంత వరకు దోసెను ఉంచి.. చట్నీతో గానీ నేతి సాంబార్‌తో గానీ హాట్ హాట్‌గా సర్వ్ చేస్తే చిన్నారులు లొట్టలేసుకుని మరీ తింటారు.

వెబ్దునియా పై చదవండి