ఫ్రూట్ సలాడ్‌ తయారీ విధానం మీ కోసం..

మంగళవారం, 24 ఏప్రియల్ 2012 (15:56 IST)
FILE
కావలసిన వస్తువులు:

చెర్రీ పండ్లు - అర కప్పు
మామిడిపండు ముక్కలు - ఒక కప్పు
దానిమ్మ గింజలు - ఒక కప్పు
ద్రాక్షపళ్ళు - ఒక కప్పు
పైనాపిల్ ముక్కలు - ఒక కప్పు
అరటిపండు ముక్కలు - ఒక కప్పు
ఆపిల్ పండు ముక్కలు - ఒక కప్పు
కమలాతొనలు - ఒక కప్పు
మిరియాలపొడి - అరస్పూన్
ఉప్పు - కొంచెం
తేనె - పావు కప్పు
నిమ్మ రసం - రెండు స్పూన్లు

తయారీ విధానం:
ముందుగా పండ్లన్నింటినీ శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఓ పెద్ద బౌల్‌లో తీసుకోవాలి. వీటి మీద మిరియాల పొడి, ఉప్పువేసి నిమ్మరసం పిండి పైన తేనె వేసి మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచితే ఫ్రూట్ సలాడ్ రెడీ. మూడు గంటల తర్వాత సలాడ్‌ను ఐస్‌క్రీమ్‌తో కలిపి సర్వ్ చేయండి.

వెబ్దునియా పై చదవండి