బీట్‌రూట్ వడ టేస్ట్ చేసి చూడండి..!!

శుక్రవారం, 13 ఏప్రియల్ 2012 (17:16 IST)
FILE
కావలసిన పదార్థాలు :
బీట్‌రూట్ తురుము - కప్పు,
పచ్చిశనగపప్పు - కప్పు,
ఉల్లిపాయ తరుగు - కప్పు,
నూనె - సరిపడినంతా,
పచ్చిమిర్చి - 6,
అల్లం తురుము - టీ స్పూను,
ఉప్పు - తగినంత,
కొత్తిమీర తరుగు - మూడు టీ స్పూన్లు.

తయారు చేసే విధానం :
ముందుగా శెనగపప్పును రెండు గంటల సమయం నానబెట్టాలి. ఈ నానబెట్టిన పప్పుని నీలు వంపేసి విడిగా తీసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, అల్లం కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి (మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు). రుబ్బిన శనగపప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు, ఉల్లితరుగు, బీట్‌రూట్ తురుము, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడలాగా ఒత్తుకుని వేడి నూనెలో దోరగా వేయించినట్లైతే వేడి వేడి బీట్‌రూట్ వడ రెడీ అయినట్టే. వీటికి టొమాటో సాస్ మంచి కాంబినేషన్.

వెబ్దునియా పై చదవండి