బేబీకార్న్‌ మంచూరియాను ఎలా తయారు చేస్తారు?

File
FILE
కావలసిన పదార్థాలు...
బేబీకార్న్‌ : 5
మొక్కజొన్న పిండి : అరకప్పు
బియ్యం పిండి : పావు కప్పు
కారం : కొద్దిగా
అల్లంవెల్లుల్లి ముద్ద : చెంచా
ఉప్పు : సరిపడ
నూనె : వేయించడానికి కావాల్సినంత.
ఉల్లిపొరక : కట్ట
ఉల్లిపాయ : ఒకటి
వెల్లుల్లి పలుకులు, సోయా టొమాటో సాస్‌ : ఒక్కొక్కటి చెంచా చొప్పున తీసుకోవాలి

తయారు చేసే విధానం...
బేబీకార్న్‌ను కోరుకున్న సైజులో తరిగి, ఉప్పు నీటిలో ఉడికించాలి. ఆ తర్వాత మొక్కజొన్న, బియ్యం పిండి, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా ఉప్పు వేసి మరో పాత్రలో బజ్జీల పిండిలా చేసుకోవాలి. ఇందులో ఉడికించిన బేబీకార్న్‌ను తడిపి బజ్జీల తరహాలో వేయించుకోవాలి.

బాణలిలో కాస్త నూనె వేడి చేసి అందులో వెల్లుల్లి పలుకులు, ఉల్లిపాయ, ఉల్లిపొర ముక్కలు ఎర్రగా వేగనివ్వాలి. ఇందులో వేయించి పెట్టుకున్న బేబీకార్న్‌ ముక్కల్లి ఒక్కోటి చొప్పున ఉంచాలి. పైన సోయా, చిల్లీసాస్‌, టొమాటో సాస్‌, ఇంకాస్త ఉప్పు చల్లితే వేడి వేడి బేబీకార్న్‌ మంచూరియా రెఢీ.

వెబ్దునియా పై చదవండి