చరిత్రను బట్టి చూస్తే, ఏనుగు తలకాయ, మనిషి శరీరం ఉన్న విగ్రహాన్ని పూజించడం ఒక్క మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూజిస్తున్నట్లు తెలుస్తోంది. పూరాతత్వ శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం భారతదేశంలోకాక బర్మా, థాయ్‌లాండ్, కంబోడియా, పర్షియా, నేపాల్, టిబెట్టు, మంగోలియా, చైనా, జపాన్, తుర్కిస్థాన్, బల్గేరియా, మెక్సికో, పెరు వంటి చాలా దేశాలలో గణపతి పూజ జరిగేది.