వినాయక చవితి : తీపి కుడుములు ట్రై చేయండి

FILE
వినాయక చవితికి తీపి కుడుములను నైవేద్యంగా పెడతారు. అయితే తీపి కుడుములు ఎలా చేయాలో మీకు తెలుసా.. తెలియదంటే ఇదిగోండి తయారీ విధానం..

కావాల్సిన పదార్థాలు :
గోధుమ రవ్వ : హాఫ్‌ కిలో,
బియ్యం పిండి : కప్పు,
పొట్టు పెసరపప్పు : పావు కిలో,
నెయ్యి : 100 గ్రాములు,
పచ్చిపాలు : పావు లీటర్‌,
బెల్లం తురుము : హాఫ్‌ కిలో,
యాలకుల పొడి : ఒక టీ స్పూన్‌,
మంచినీళ్ళు : తగినంత,
కొబ్బరికాయ : ఒకటి.

తయారీ విధానం : ముందుగా పెసరపప్పును పొడి చేయాలి. కొబ్బరిని తురుమి పక్కనబెట్టుకోవాలి. తర్వాత గోధుమరవ్వలో పెసరపప్పు పొడి, బియ్యం పిండి, బెల్లం తురుము, పాలు, కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి.

అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళు పొసుకుంటూ గట్టి ముద్దలాగా చేసుకోవాలి. దీనిని చిన్న ముద్దలుగా చేసుకుని అరచేతిపై కోలగా వత్తుకుని పక్కనబెట్టుకోవాలి. స్టవ్‌ వెలిగించి కుక్కర్‌లో సుమారు 20 నిమిషాల వరకు ఆవిరి మీద ఉడికించాలి. అంతే.. తీపి కుడుములు రెడీ..

వెబ్దునియా పై చదవండి