వినాయక చవితి : పాల తాళికలు ఎలా చేయాలి?

వినాయకుని పాలతాళికలు ఉండ్రాళ్ళు అంటే ప్రీతికరం. పండ్లు, తీపి పదార్థాలనే విఘ్నేశ్వరునికి నైవేద్యంగా పెడతారు. అలాంటి వాటిలో పాల తాళికలు కూడా వున్నాయి. మరి పాల తాళికలు ఎలా చేయాలో చూద్దామా..

కావాల్సిన పదార్థాలు :
బియ్యం పిండి : ఒకటిన్నర కప్పు,
చక్కెర : రెండు కప్పులు,
పాలు : అరలీటర్‌,
జీడిపప్పు, ఎండుద్రాక్ష : 50 గ్రాములు
యాలకుల పొడి : రెండు చెంచాలు,
పచ్చి కొబ్బరి తురుము : కప్పు
నెయ్యి : ఐదు చెంచాలు.

తయారీ విధానం : ముందుగా వెడల్పాటి పాన్‌లో కప్పు నీళ్ళు మరిగించాలి. అందులో పిండి గట్టిపడకుండా కలిపాలి. కిందకు దించేసి చల్లారిన తరువాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని పిండిని సన్నని నూడుల్స్‌ మాదిరిగా చేసుకోవాలి. ఇలా అన్నింటిని చేసుకుని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. (వీటినే తాళికలు అంటారు).

మరో గిన్నెలో పాలు మరగించాలి. ఇందులో పిండితో చేసుకున్న తాళికలను ఉడికించాలి. బాణలిలో నెయ్యి కరిగించి అందులో ఎండుద్రాక్ష, జీడిపప్పు పలుకులను వేయించి పాలల్లో వేయాలి. కొబ్బరి తరుము, చక్కెర, యాలకుల పొడి వేయాలి. బాగా కలిపిన తరువాత దింపేయాలి. అంతే పాల తాళికలు రెడీ..

వెబ్దునియా పై చదవండి