చాలామంది మహిళల్లో నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుంనొప్పి సహజంగా కనిపిస్తాయి. అయితే వీటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో రుతుస్రావం మొదలుకావడానికి రెండు మూడు రోజుల నుండే పొత్తికడుపులో ఇబ్బందిగా ఉంటుంది. నడుము నొప్పిగా ఉంటుంది. మరి వాటిని తగ్గించే చిట్కాలేంటో చూద్దాం.
2. ప్రతిసారి నీళ్ళు తాగాలంటే కూడా ఇబ్బందే కాబట్టి ఓసారి హెర్బల్ టీని తీసుకోండి. వెచ్చటి ద్రవం గొంతు దిగుతుంటే హాయిగా ఉంటుంది. అల్లం, పిప్పరమెంట్, లెమన్.... ఇలా రకరకాల హెర్బల్ టీలను తాగవచ్చు. వీటిలోని ఔషధ గుణాలు అలసట పోగొట్టడమే కాకుండా నొప్పి తీవ్రతను తగ్గిస్తాయి.
4. ఉప్పు, నూనె ఎక్కువగా ఉంచే పదార్ధాలను తీసుకోవడం ఈ సమయంలో మంచిది. వీటి బదులుగా తాజాపండ్లను భోజనంలో చేర్చుకోవడం మంచిది. అరటిపండును తరచు తీసుకోవాలి. ఇందులోని మెగ్నీషియం ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది. తాజా ఆకు కూరల ద్వారా శరీరానికి కావల్సినంత ఇనుము కూడా అందుతుంది.