నిమ్మకాయ-దోసకాయ పానీయం: చిన్న దోసకాయ, నిమ్మకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెడల్పాటి జాడీలో వేసి రెండు గ్లాసుల నీళ్లతో నింపాలి. దానితో పాటు కొన్ని పుదీనా ఆకులను రుబ్బుకోవాలి. ఈ రసాన్ని వడపోసి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరానికి చేరే క్యాలరీలను అదుపులో ఉంచుకుని నీటిని నిలుపుకోవడానికి ఇది సహకరిస్తుంది. ఇది తాగితే రోజంతా ఉత్సాహంగా పని చేయవచ్చు.
అలాగే క్యారెట్-ఆరెంజ్ జ్యూస్: క్యారెట్‌లో ఫైబర్, బీటా కెరోటిన్ మొదలైనవి ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. ఇది తక్కువ తినడానికి కూడా దారి తీస్తుంది. నారింజలో ఉండే విటమిన్ సి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందులో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి తాగాలి.