నూయీ శక్తివంతమైన మహిళ : ఫార్చ్యూన్

File
FILE
భారత సంతతికి చెందిన పెప్సికో ప్రధాన కార్యనిర్వహణాధికారిణి ఇందిరా నూయీను అతి శక్తివంతమైన మహిళగా ఎన్నికైందని ప్రముఖ పత్రిక "ఫార్చ్యూన్" వెల్లడించింది. గత నాలుగు సంవత్సరాలుగా ఆమె తన కార్యకలాపాలను నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారని ఆ పత్రిక పేర్కొంది.

తాము నిర్వహించిన సర్వేలో శక్తివంతమైన 50 మంది మహిళల్లో 53 సంవత్సాలు కలిగిన నూయీ రెండవసారి కూడా ప్రథమ స్థానంలో ఎంపిక కావడం తమ పత్రికకే ఎంతో గర్వకారణంగా ఉందని ఆ పత్రిక నిర్వాహకులు తెలిపారు. క్రాఫ్ట్ ఫుడ్‌కు చెందిన డరేనే రోసన్‌ఫెల్డ్ రెండవ స్థానంలో ఉండగా మూడవ స్థానంలో సోయాబీన్ కంపెనీకి చెందిన ఆర్చర్ డేనియల్స్ మిడ్‌లైండ్ పైట్ వోర్టజ్ ఉన్నారని పత్రిక వెల్లడించింది.

ఇదిలావుండగా వీరు ముగ్గురు మహిళలు నిరుడు కూడా ఇదే స్థానాల్లో ఉన్నారని ఆ పత్రిక తెలిపింది.

కాగా నూయీ వరుసగా నాలుగవసారి ఇదే స్థానాన్ని ఆమె పొందడం, ఆమె నేతృత్వంలో పెప్సికో వరుసగా లాభాల బాటలో పయనిస్తుండటమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చని ఆ పత్రిక పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి