మీ శిశువును చూసుకోండిలా!

** శిశువు పుట్టిన ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలను మాత్రమే ఇవ్వాలి. ఇలా చేస్తే పిల్లలు నిమోనియా బారిన పడరంటున్నారు వైద్యులు.

** శిశువును నిమోనియానుంచి కాపాడుకునేందుకు టీకాలు లభ్యమవుతుంటాయి. వీటిని ప్రసూతి వైద్యశాలల్లో శిశువులకు వేస్తారు. వీటిలో బీసీజీ, హెచ్ఐవీ, డీపీటీలాంటివి ప్రముఖమైనవి.

** గర్భిణీ స్త్రీలను బాగా చూసుకుంటే పుట్టబోయే శిశువు బరువు బాగుంటుంది. శిశువు పుట్టినప్పుడు రెండున్నర కిలోలకన్నా ఎక్కువ బరువుండాలి. ఇలాంటి పిల్లలకు నిమోనియా తక్కువగా వస్తుంది.

** మీ బుజ్జి పాపాయికి వాడే అన్ని రకాల కాస్మోటిక్స్ పాపాయి చర్మానికి హాని కలగకుండా ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు బేబీసోప్, బేబీ ఆయిల్, బేబీ షాంపూ, బేబీ పౌడర్, క్రీములు మొదలైనవి.

వెబ్దునియా పై చదవండి