ముడతలు పడిన చర్మానికి పుచ్చకాయ

FILE
** పుచ్చకాయ శరీరానికి చలువ చేస్తుంది. ఇందులోనున్న చలువదనం కారణంగా నిత్యం పుచ్చకాయను వాడుతుంటే చర్మంలోని ముడుతలు పోగొట్టే దివ్యౌషధంలా పని చేస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు.

** పుచ్చకాయతో ఫేస్‌ప్యాక్: పుచ్చకాయలోని తెల్లటి పదార్థంలోని రసాన్ని తీసుకోండి. అందులో రెండు లేక మూడు చుక్కల తేనెను కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయండి. ఇలా 15 నిమిషాలవరకుంచండి.

ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయండి. దీంతో మీ చర్మం కోమలంగాను, చర్మంపైనున్న నల్లటి మచ్చలు తొలగిపోతాయంటున్నారు సౌందర్య నిపుణులు.

వెబ్దునియా పై చదవండి