సంబంధం కుదిరింది కదా అని...

FILE
చాలా కాలం తర్వాత పెళ్ళి కుదిరింది. కాని పెళ్ళి అనేది నూరేళ్ళ పంట. ఈ లోపల ఇంట్లో వారు అటువైపు, ఇటువైపు బంధువులకు పిలుపు కార్యక్రమాలు, అలాగే పెండ్లి కార్యక్రమాలలో బిజీగా ఉంటారు. కాని ఇంతలోనే ప్రేమతో కాబోయే శ్రీవారు డేటింగ్‌కు పిలుస్తారు. సంబంధం కుదిరింది కదా పెళ్ళి జరిగేంత వరకు నేను తట్టుకోలేను అంటూ రకరకాల పరిభాషలు ప్రారంభమై సెల్‌ఫోన్లలో సంభాషణలు దాటి చేతలకు వస్తుంటాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు కొన్ని నియమాలను గుర్తుంచుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది.

** సంబంధం కుదిరింది కదా అని కాబోయే మీ శ్రీవారు పిలిచిన వెంటనే అతనితో కలిసి బయటకు వెళ్ళేందుకు సిద్ధపడకండి.

** ఇంట్లో ఎవరైనా పెద్ద వ్యక్తిని మీ వెంట తీసుకుని వెళ్ళండి. లేదా మీరు ఎవరితో ఎక్కడికి వెళుతున్నదీ మరీ చెప్పి వెళ్ళండి.

** డేటింగ్‌కు పిలిస్తే గుడ్డిగా నమ్మి వెళ్ళకండి. సంయమనం పాటించండి.

** మీకు తెలియని ప్రదేశానికి లేదా ఎవ్వరూ లేని చోటికి వెళ్ళకండి.

** మరీ రాత్రి అయ్యేంత వరకు తిరగకండి.

** కారులో కూర్చుంటే గ్లాస్ డోర్స్ పూర్తిగా మూయకండి.

** పలుచటి, ఇతరులను కవ్వించే వస్త్రాలను ధరించకండి.

** డిస్కో, క్లబ్‌లలో రాత్రి ఎక్కువ సమయం గడపకండి. పబ్బులకైతే అస్సలు పోకండి.

** గతంలో మీ స్నేహితులతో గడిపినంతగా మీకు సంబంధం కుదిరిన తర్వాత వారితో గడపడం మానుకోకండి.

** సంబంధం కుదిరింది కదా అని అతని శారీరక తృప్తి కోసం మీరు తొందర పడకండి.

** అశ్లీల భాష లేదా అశ్లీల కార్యాలకు దిగకండి.

మీకు అతనితో డేటింగ్ చేయాలనే ఉంటే ఈ విషయాలను ఖచ్చితంగా పాటించండి.

** ఏదైనా మంచి పార్క్ లేదా రెస్టారెంట్‌లో కూర్చుని కబుర్లు చెప్పండి.

** కాబోయే మీ వారితో కలిసేందుకు పగటిపూట శ్రేయస్కరం అనే విషయాన్ని గుర్తుంచుకోండి.

** వివాహమయ్యేంత వరకు క్రమశిక్షణతో మెలగండి.

** మీ క్యారెక్టర్ కాపాడుకునేందుకు ప్రయత్నించండి. దీనికి మీరు స్థిరత్వాన్ని పెంపొందించుకోవాలి.

** సంబంధ బాంధవ్యాలను గౌరవప్రదమైన భాషలో ఉపయోగించండి.

** ఎదుటివారితో గౌరవంగా మెలగండి.

వెబ్దునియా పై చదవండి