సౌందర్య లహరి...స్వప్న సుందరి...!

స్త్రీలు, అమ్మాయిలు నిత్యం అందంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటివారు ప్రతి ఋతువులో ప్రకృతిపరంగా లభించే పండ్లు వాడితే సహజ సౌందర్యం ఉట్టిపడుతుంది. దీనికి ఖర్చుకూడా చాలా తక్కువే. ఇవి మార్కెట్లో లభించే కాస్మొటిక్స్ కన్నాకూడ చాలా తక్కువే. కాస్మొటిక్స్‌లలో రసాయనాలు కలిపి ఉంటారు. కాని ప్రకృతిపరంగా లభించే పదార్థాలలో ఎలాంటి కృత్రిమ రసాయనాలుండవు.

ఆపిల్ : అమ్మాయిలు, మహిళలు నిత్యం ఆపిల్ తింటుంటే జిడ్డు చర్మం ఉన్నవారికి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఆపిల్ గుజ్జును ముఖంపై పూసి 10 నుంచి 15 నిమిషాలపాటు అలాగే ఉంచాలి. కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోండి.

బాదామ్ : పొడి చర్మం ఉన్నవారికి బాదామ్ చాలా ఉపయోగపడుతుంది. ఇది చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. మీ చర్మం కోమలంగాను తయారవుతుందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

విధానం : ఓ కప్పు చల్లటి పాలలో ఒక ఔన్సు బాదాం పొడి కలిపి బాగా చిలకండి. ఆ తర్వాత అర ఔన్సు చక్కెరను అందులో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులపై పూయండి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో ముకం కడుక్కోండి. దీంతో మీ ముఖ సౌందర్యం పెరుగుతుంది.

టమోటా : నిత్యం కూరలలో వాడే టమోటా పండులో అత్యధికమైన విటమిన్లున్నాయి. ఈ పండు చర్మ కాంతిని పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది. దీంతోపాటు చర్మం మృదువుగా మారుతుంది. టమోటాను ఉపయోగించడంవలన చర్మంపైనున్న మచ్చలు, మటుమాయమవుతాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.

విధానం : టమోటా రసం, నిమ్మకాయ రసం, గ్లిజరిన్‌లను సమపాళ్ళల్లో కలుపుకోవాలి. ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కున్న తర్వాత ఈ మిశ్రమంతో చర్మంపై మాలిష్ చేయండి. అరగంట అయిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. దీంతో మీ చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

వెబ్దునియా పై చదవండి