60ఏళ్ళపైబడిన మహిళలకు 'అభయహస్తం'

అరవై సంవత్సరాలకు పైబడిన మహిళలకు 'అభయ హస్తం' పథకం క్రింద ఆదుకోనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ప్రత్యేకంగా మహిళలకోసం అభయ హస్తం పథకంలో మార్పులు చేసి అరవై సంవత్సరాలకుపైబడిన మహిళలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని ఆమె వివరించారు.

మహిళలకు గత ఐదు సంవత్సరాలలో రూ. 22వేల కోట్లు పావలా వడ్డీకే రుణాలుగా ఇచ్చామని, ఈ ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆమె అన్నారు.

ఇదిలావుండగా ఒక కోటి ముఫై లక్షల రూపాయల విలువైన చెక్కులను వివిధ మహిళా సంఘాలకు మంత్రి పంపిణీ చేశారు.

కాగా ఒక కోటి 80 లక్షల రూపాయల వ్యయమయ్యే వివిధ అభివృద్ధి పనులకు మంత్రిణి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.

వెబ్దునియా పై చదవండి