27-07-2020 సోమవారం మీ రాశి ఫలితాలు.. యజమానులను తక్కువ చేసి..?

సోమవారం, 27 జులై 2020 (00:00 IST)
మేషం: బంగారు వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. రవాణా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లలో ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. 
 
వృషభం: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. బంధువుల కలయికతో పాత విషయాలు జ్ఞప్తికి రాగలవు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తులు, చిరు వ్యాపారులకు సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. 
 
మిథునం: నిరుద్యోగులు ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక ఎలాంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. మీ కళత్ర, మీ కుటుంబీకుల మొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. రాజకీయాల్లో వారికి సంక్షోభం తప్పదు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
కర్కాటకం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రాజకీయాల్లోని వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తగలవు. బ్యాంకు వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సమస్యలు తలెత్తినప్పుడు తెలివితో పరిష్కరించగలగాలి. విద్యార్థులలో నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
సింహం: మీరు పరోక్షంగా చేసే కార్యక్రమాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. విదేశాలు వెళ్ళాలనే మీ ఆలోచన క్రియా రూపంలో పెట్టండి. ప్రైవేట్ రంగాల్లోని వారు యజమానులను తక్కువ చేసి సంభాషిచడం వల్ల ఇబ్బందులకు లోనవుతారు. వాహనచోదకులకు చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం వుంది. 
 
కన్య: ప్రభుత్వ రంగాల్లోని వారికి అనుకున్నంత అభివృద్ధి కానరాదు. స్త్రీలతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. చిన్నతరహా పరిశ్రమల్లో వారికి విద్యుత్ లోపం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
తుల: ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ఉద్యోగస్తులు ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. బంగారం, వెండి, వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితంగా ఉండగలదు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. మీ రాక బంధువులకు ఎంతో ఉల్లాసాన్ని కల్గిస్తుంది. 
 
వృశ్చికం: ఆర్థిక వ్యవహారాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సులతో సదవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కొంతమంది మీ పరపతిని దుర్వినియోగం చేస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. 
 
ధనస్సు: సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. గణిత, సైన్స్, సాంకేతిక పరిశోధకులకు, అంతరిక్ష రంగాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. సినిమా కళాకారులకు అపవాదులు అధికమవుతాయి. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చులు చేస్తారు. ప్రముఖులు కలుసుకుంటారు. 
 
మకరం: క్రీడా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. స్త్రీలకు కొత్త కొత్త కోరికలు, సరదాలు స్ఫురిస్తాయి. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి. తలకు మించిన బాధ్యతలతో తలమునకలౌతుంటే కాస్త ఓపిగ్గా వ్యవహరించండి.
 
కుంభం: దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటి పైనే శ్రద్ధ వహించండి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. బంధువులను కలుసుకుంటారు.
 
మీనం: సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాల్లో అపరిచితుల వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉపాధ్యాయులకు, ప్రైవేట్ రంగాల్లో వారికి అనుకోని అభివృద్ధి కానరాగలవు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు