22-05-2025 గురువారం దినఫలితాలు - పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది...

రామన్

గురువారం, 22 మే 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలను నిబ్బరంగా ఎదుర్కుంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. సావకావశంగా పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిచయస్తుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. అపోహలకు తావివ్వవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. ఆలయాలకు విరాళాలందిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. కార్యసాధనకు మరింత శ్రమించాలి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఊహించని సంఘటన ఎదురవుతుంది. నోటీసులు అందుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. మీ నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యమవుతుంది. ఖర్చులు విపరీతం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. సంతానం దూకుడు అదుపుచేయండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణ విముక్తులవుతారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఖర్చులు విపరీతం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలను సంప్రదిస్తారు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. రావలసిన ధనం అందదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. కీలక విషయాలు వెల్లడించవద్దు. నోటీసులు అందుకుంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రణాళికలు వేసుకుంటారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఆప్తులతో ఉత్సాహంగా గడుపుతారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. పాత పరిచయస్తులు తారసపడతారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో నిలదొక్కుకోవటానికి శ్రమించండి. పరిచయస్తులు సాయం అర్థిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ప్రత్యర్ధులను ఓ కంట కనిపెట్టండి. పొగిడే వారితో జాగ్రత్త. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు