తేదీ 31-01-2023 మంగళవారం దినఫలాలు - వరసిద్ధివినాయకుడిని గరికెతో...

మంగళవారం, 31 జనవరి 2023 (04:00 IST)
మేషం :- ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరతారు. విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు.
 
వృషభం :- మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. ఒక ఖర్చు నిమిత్తం తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగిస్తారు. నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు, వ్యాపారస్తులకు కలిసివచ్చేకాలం. రవాణా రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
మిథునం :- ఇతరుల సహాయం అర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు కూరగాయల వ్యాపారులు పురోభివృద్ధి పొందుతారు. బంధుమిత్రుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. 
 
కర్కాటకం :- పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు సత్తా చాటుకునేందుకు తగిన సమయం. కుటుంబ విషయంలో కూడా మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. ఉద్యోగినులకు ఉన్నత స్థితి దక్కుతుంది. కుటుంబీకులతో అనుకోని ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ సమసర్థత, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి.
 
సింహం :- మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. మిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. కళాకారులకు సత్కారాలు అందుతాయి.
 
కన్య :- బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ అవసరం. రావలసిన మొండి బాకీలు ఆలస్యమైనకానీ వసూలవుతాయి. సేవా సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళుకువ అసవరం. పత్రికా రంగంలోని వారికి నిరుత్సాహం తప్పదు. మీ తొందరపాటు నిర్ణయాన్ని బంధుమిత్రులు వ్యతిరేకిస్తారు.
 
తుల :- ఆకాల భోజనం వల్ల మీ ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది.
 
వృశ్చికం :- ఆర్థికపరమైన సమస్యలు తీరతాయి. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్థులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. స్త్రీలకు షాపింగ్ పట్ల ఆశక్తి పెరుగుతుంది. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
ధనస్సు :- వ్యాపార అభివృద్ధికి చేసే కృషి ఫలిస్తుంది. అందరకీ సహాయం చేసి మాటపడతారు. కాంట్రాక్టర్లకు నూతన అవకాశాలు లభించినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు బంధువులలో సఖ్యత నెలకొంటుంది. మీ ఉన్నతిని చాటు కోవడం కోసం ధనమును విరివిగా ఖర్చులుచేస్తారు.
 
మకరం :- మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి స్నేహితులు మీకు కొత్తగా పరిచయం అవుతారు. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. అదనపు రాబడి దక్కడంతో ఉత్సాహంగా గడుపుతారు. ఇచ్చిపుచ్చుకొను వ్యవహారాలు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి.
 
కుంభం :- ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. సేల్స్ సిబ్బందికి ధన, వస్తు ప్రతిఫలం అందిస్తారు. మీ కృషికి తగిన ప్రతిఫలం ఆలస్యంగా అందుతుంది. స్త్రీలకు షాపింగ్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. పాత బాకీలు అనుకోకుండా వసూలవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
మీనం :- బంధువుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోళ్ళ నిమిత్తం ధనం బాగా ఖర్చు చేస్తారు. వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు