23-10-2021 శనివారం దినఫలాలు .. ఇష్టదైవాన్ని ఆరాధించిన సర్వదా శుభం

శనివారం, 23 అక్టోబరు 2021 (04:00 IST)
మేషం :- భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్ధలు, చికాకులు తలెత్తుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. రాజకీయాల్లో వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి.
 
వృషభం :- పత్రికా రంగంలో వారికి ఒత్తిడి తప్పదు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. మీ మాటే నెగ్గాలన్న పట్టుదలకు పోవటం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
మిథునం :- ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. విద్యార్థుల్లో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ప్రముఖులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి.
 
కర్కాటకం :- దైవ సేవా కార్యక్రమాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. చేతి వృత్తుల్లో వారికి ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
సింహం :- ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. శాంతియుతంగా మీ సమస్యలు పరిష్కరించుకోవాలి. విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. వ్యవసాయ రంగంలోని వారికి వాతావరణంలో మార్పు ఆందోళన కలిగిస్తుంది. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు ఎదుర్కొంటారు.
 
కన్య :- రాజకీయాల్లో వారికి ఒడిదుడుకులు తప్పవు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్థిరాస్తి ఏదైనా అమ్మకం చేయలనే మీ ఆలోచన వాయిదా పడుతుంది.
 
తుల :- బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. కొత్త పథకాలు, ప్రణాళికలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వైద్యరంగాల వారికి ఏకాగ్రత ముఖ్యం. వాహన సౌఖ్యం పొందుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి.
 
వృశ్చికం :- భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు అనూహ్య స్పందన లభిస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన కొంతకాలం వాయిదా వేయడం మంచిది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. నిరుద్యోగులకు బోగన్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం.
 
ధనస్సు :- ఉద్యోగ, వ్యాపారాలలో బాగుగా రాణిస్తారు. దంపతుల మధ్య విబేధాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. వ్యాపకాలుమాని కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించండి. మీ అభిరుచి తగిన వ్యక్తితో పరియం ఏర్పడుతుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మకరం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వస్త్ర బేకరి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులరాకతో గృహంలో సందడి కానవస్తుంది. బాకీలు వసూలు కాకపోవటంతో ఆందోళన చెందుతారు.
 
కుంభం :- ట్రాన్సుపోర్టు, ఆటోమొబెల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికం. మనోధైర్యంతో ముందుకు సాగండి. ప్రైవేట్ సంస్థలలోని వారికి ఎంత శ్రమించినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. స్త్రీలకు ధనార్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మీనం :- వృత్తి వ్యాపారాలలో కష్ట నష్టాలను ఎదుర్కొంటారు. తల పెట్టిన పనులు మొక్కుబడిగా సాగుతాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. పెద్దల గురంచి ఆందోళన చెందుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు